మా నిచ్చి (మామ్స్ రెండో కొడుకు) డాక్టర్ అయిపోయాడోచ్…ఏంటో మొన్న మొన్నే పుట్టినట్టుంది వాడు..తను పుట్టినప్పుడు నాకు ఏడేళ్ళు…తేజ (తమ్ముడు), చైతు (మామ్స్ మొదటి కొడుకు) వీళ్ళిద్దరూ నాకంటే రెండు-మూడేళ్ళే చిన్న…సో వీళ్ళని ఆడించలేదు నేను……నిచ్చి పుట్టినప్పుడయితే నేను కొంచెం పెద్దయ్యా కాబట్టి వాడిని ఎతుకోనిచ్చేవాళ్ళు…చిన్న బొమ్మలా అనిపించేవాడు నాకు…పెద్ద పెద్ద కళ్లు, భలే భలే బుగ్గలు…చాలా ముద్దుగా వుండేవాడు
Showing posts with label కుటుంబం. Show all posts

Friday, February 3, 2012
మా బుల్లి డాట్రు
మా నిచ్చి (మామ్స్ రెండో కొడుకు) డాక్టర్ అయిపోయాడోచ్…ఏంటో మొన్న మొన్నే పుట్టినట్టుంది వాడు..తను పుట్టినప్పుడు నాకు ఏడేళ్ళు…తేజ (తమ్ముడు), చైతు (మామ్స్ మొదటి కొడుకు) వీళ్ళిద్దరూ నాకంటే రెండు-మూడేళ్ళే చిన్న…సో వీళ్ళని ఆడించలేదు నేను……నిచ్చి పుట్టినప్పుడయితే నేను కొంచెం పెద్దయ్యా కాబట్టి వాడిని ఎతుకోనిచ్చేవాళ్ళు…చిన్న బొమ్మలా అనిపించేవాడు నాకు…పెద్ద పెద్ద కళ్లు, భలే భలే బుగ్గలు…చాలా ముద్దుగా వుండేవాడు
చీరలు – విఙ్ఞానము
అబ్బాయిలూ…ముందే చెప్తున్నా, మీకు ఈ సుత్తి నచ్హదు, చదవకండి….చదివాక ఏంటీ గోల అంటే నేనేం చెయ్యలేను
**********************************************************************************
తోడికోడలు 2: ఆక్కా, నువ్వు చీరలెక్కడ కొంటావ్?
తోడికోడలు 1: నాకు చీరలెక్కువ లేవు..నిశ్చితార్థం అప్పుడు ఒక పట్టుచీర, పెళ్ళప్పుడు 3 పట్టుచీరలు, ఒక హెవీ వర్క్ చీర, 4 లైట్ వర్క్ చీరలు కొన్నాను, అన్నీ హైదరాబాద్ లోనే. మా ఉషత్తమ్మ తీసుకెళ్లింది యేవో షాప్స్ కి. నాకు పేర్లు గుర్తులేవు.
తోడికోడలు 2: (ఆశ్చర్యంగా)అదేంటి, అంతేనా?
తోడికోడలు 1: అంతే మరి, తర్వాత వాళ్లూ వీళ్లూ పెట్టినవి ఒక 4 చీరలున్నాయి..మొత్తం 13,14 వున్నాయి
తోడికోడలు 2: (ఇంకా ఆశ్చర్యంగా) అదేంటక్కా, పెళ్లయ్యాక (4 యేళ్లలో) చీరలే కొనలేదా నువ్వు?
తోడికోడలు 1: ఊహూ
తోడికోడలు 2: బావ కూడా కొనివ్వలేదా?
తోడికోడలు 1: కికికి
తోడికోడలు 2: !!! :shock: పోనీ నగలు?
తోడికోడలు 1: ఊహూ
తోడికోడలు 2: ఏం?
తోడికోడలు 1: నాకు పెద్దగా ఆసక్తి లేదు
తోడికోడలు 2: హ్మ్మ్మ్మ్మ్
తోడికోడలు 1: (పాపం ఇప్పటికే చాలా ప్రశ్నలు అడిగింది, నేను అడక్కపోతే బాగోదేమో) మరి నువ్వు ఎక్కడ కొన్నావ్ నీ పెళ్లి చీరలు?
తోడికోడలు 2: (చాలా ఉత్సాహంగా) కంచి వెళ్లాంగా…మా అమ్మ, నేను, అత్తమ్మ, ఇంకా మా చుట్టాలు చాలా మంది అందరం వెళ్లి కొన్నాం.
తోడికోడలు 1: ఆహా, అలాగా…నీ పెళ్లి పట్టుచీరలు అన్నీ బావున్నాయి
తోడికోడలు 2: (చాలా సంతోషంగా) థాంక్స్ అక్కా, కానీ నా పెళ్లిలో నేను కట్టుకున్నది ఒకే పట్టుచీర కదా?
తోడికోడలు 1: అదేంటి, రెసెప్షన్ అప్పుడూ, నలుగు అప్పుడూ కట్టుకున్నవో?
తోడికోడలు 2: అవి బెనారస్ చీరలు కదక్కా?
తోడికోడలు 1: (మనకి బెనారస్ కి పట్టుకి తేడా తెలిస్తే కదా
) ఓహ్, అవును కదా…మరి అవి కూడా కంచిలోనే కొన్నారా?
తోడికోడలు 2: (కొంచెం వింతగా చూస్తూ) అదేంటక్కా….బెనారస్ చీరలు కదా..కంచిలో ఎలా కొంటాం?
తోడికోడలు 1: (బాప్ రే, ఇదొకటుందా)ఓహో, అయితే బెనారస్ కూడా వెళ్లారా?
తోడికోడలు 2: !!!! బెనారస్ దాకా ఎందుకక్కా? చెన్నైలో, బెంగుళూరు లో దొరుకుతాయిగా?
తోడికోడలు 1: (ఇప్పటికే మన తెలివితేటలు ఈ పిల్లకి అర్ధమయిపోయాయి..ఇంకాసేపు ఇక్కడుంటే ఉన్న కాస్త ఇమేజ్ దెబ్బయిపోతుంది) ఆ అత్తమ్మా వస్తున్నా…
తోడికోడలు 1: (ఆత్మపరిశీలన) ఈ అమ్మాయి పదే పదే అశ్చర్యపోయె అంతగా నేనేం మాట్లాడానబ్బా? చీరలు, నగలంటే ఆసక్తి లేని వాళ్లు చాలా మంది వుంటారుగా…ఎందుకలా ఫేస్ పెట్టినట్టు?
యేదయితే ఎం లే….నేను చీరల గురించి కొంత తెల్సుకోవాలి
జై గూగుల్…జై జై గూగుల్

Subscribe to:
Posts (Atom)