Showing posts with label ముందు మాట. Show all posts
Showing posts with label ముందు మాట. Show all posts

Friday, February 3, 2012

ముందు మాట

నాకు తెలుగు భాష అంటే చాలా చాలా ఇష్టం. అచ్చ తెలుగులో బ్లాగ్ రాయాలన్న తపన తోనే ఈ బ్లాగ్ మొదలుపెడుతున్నాను. దీనికో కాన్సెప్ట్ అంటూ ఏమీ లేదు. నా ఆలోచనలు, స్పందనలు, భావాలు, ఇంకా కొంచెం సోది అంతా కలిపి నాకు తోచిన రాతలు వ్రాసుకోడానికే ఈ బ్లాగ్.

ఎప్పుడూ సంతోషంగా వుండాలన్నదే నా జీవితాశయం కాబట్టి ఈ బ్లాగ్ కి ఖుషీ ఖుషీగా అన్న పేరు పెట్టాను. నాకో పాప పుడితే ఖుషి అన్న పేరే పెట్టాలనుకున్నాను, కానీ దేవుడు నాకో ఆకు రౌడీ ని ఇచ్చాడు...ఏం చేస్తాం, దేవుడిచ్చిన కొడుకుతో సర్దుకుపోయి ఇలా నా బ్లాగ్ కి నాకిష్టమయిన పేరు పెట్టుకుని మురిసిపోతాను.