Friday, February 3, 2012

చీరలు – విఙ్ఞానము

అబ్బాయిలూ…ముందే చెప్తున్నా, మీకు ఈ సుత్తి నచ్హదు, చదవకండి….చదివాక ఏంటీ గోల అంటే నేనేం చెయ్యలేను  :evil:
**********************************************************************************
తోడికోడలు 2: ఆక్కా, నువ్వు చీరలెక్కడ కొంటావ్?
తోడికోడలు 1: నాకు చీరలెక్కువ లేవు..నిశ్చితార్థం అప్పుడు ఒక పట్టుచీర, పెళ్ళప్పుడు 3 పట్టుచీరలు, ఒక హెవీ వర్క్ చీర, 4 లైట్ వర్క్ చీరలు కొన్నాను, అన్నీ హైదరాబాద్ లోనే. మా ఉషత్తమ్మ తీసుకెళ్లింది యేవో షాప్స్ కి. నాకు పేర్లు గుర్తులేవు.
తోడికోడలు 2: (ఆశ్చర్యంగా)అదేంటి, అంతేనా?
తోడికోడలు 1: అంతే మరి, తర్వాత వాళ్లూ వీళ్లూ పెట్టినవి ఒక 4 చీరలున్నాయి..మొత్తం 13,14 వున్నాయి
తోడికోడలు 2: (ఇంకా ఆశ్చర్యంగా) అదేంటక్కా, పెళ్లయ్యాక (4 యేళ్లలో) చీరలే కొనలేదా నువ్వు?
తోడికోడలు 1: ఊహూ
తోడికోడలు 2: బావ కూడా కొనివ్వలేదా?
తోడికోడలు 1: కికికి :D
తోడికోడలు 2: !!!   :shock: పోనీ నగలు?
తోడికోడలు 1: ఊహూ
తోడికోడలు 2: ఏం?
తోడికోడలు 1: నాకు పెద్దగా ఆసక్తి లేదు
తోడికోడలు 2: హ్మ్మ్మ్మ్మ్ :(
తోడికోడలు 1: (పాపం ఇప్పటికే చాలా ప్రశ్నలు అడిగింది, నేను అడక్కపోతే బాగోదేమో) మరి నువ్వు ఎక్కడ కొన్నావ్ నీ పెళ్లి చీరలు?
తోడికోడలు 2: (చాలా ఉత్సాహంగా) కంచి వెళ్లాంగా…మా అమ్మ, నేను, అత్తమ్మ, ఇంకా మా చుట్టాలు చాలా మంది అందరం వెళ్లి కొన్నాం.
తోడికోడలు 1: ఆహా, అలాగా…నీ పెళ్లి పట్టుచీరలు అన్నీ బావున్నాయి
తోడికోడలు 2: (చాలా సంతోషంగా) థాంక్స్ అక్కా, కానీ నా పెళ్లిలో నేను కట్టుకున్నది ఒకే పట్టుచీర కదా?
తోడికోడలు 1: అదేంటి, రెసెప్షన్ అప్పుడూ, నలుగు అప్పుడూ కట్టుకున్నవో?
తోడికోడలు 2: అవి బెనారస్ చీరలు కదక్కా?
తోడికోడలు 1: (మనకి బెనారస్ కి పట్టుకి తేడా తెలిస్తే కదా :P ) ఓహ్, అవును కదా…మరి అవి కూడా కంచిలోనే కొన్నారా?
తోడికోడలు 2: (కొంచెం వింతగా చూస్తూ) అదేంటక్కా….బెనారస్ చీరలు కదా..కంచిలో ఎలా కొంటాం?
తోడికోడలు 1: (బాప్ రే, ఇదొకటుందా)ఓహో, అయితే బెనారస్ కూడా వెళ్లారా?
తోడికోడలు 2: !!!! బెనారస్ దాకా ఎందుకక్కా? చెన్నైలో, బెంగుళూరు లో దొరుకుతాయిగా?
తోడికోడలు 1: (ఇప్పటికే మన తెలివితేటలు ఈ పిల్లకి అర్ధమయిపోయాయి..ఇంకాసేపు ఇక్కడుంటే ఉన్న కాస్త ఇమేజ్ దెబ్బయిపోతుంది) ఆ అత్తమ్మా వస్తున్నా…
తోడికోడలు 1: (ఆత్మపరిశీలన) ఈ అమ్మాయి పదే పదే అశ్చర్యపోయె అంతగా నేనేం మాట్లాడానబ్బా? చీరలు, నగలంటే ఆసక్తి లేని వాళ్లు చాలా మంది వుంటారుగా…ఎందుకలా ఫేస్ పెట్టినట్టు?
యేదయితే ఎం లే….నేను చీరల గురించి కొంత తెల్సుకోవాలి
జై గూగుల్…జై జై గూగుల్ :D

No comments:

Post a Comment