Friday, February 3, 2012

మా బుల్లి డాట్రు


మా నిచ్చి (మామ్స్ రెండో కొడుకు) డాక్టర్ అయిపోయాడోచ్…ఏంటో మొన్న మొన్నే పుట్టినట్టుంది వాడు..తను పుట్టినప్పుడు నాకు ఏడేళ్ళు…తేజ (తమ్ముడు), చైతు (మామ్స్ మొదటి కొడుకు) వీళ్ళిద్దరూ నాకంటే రెండు-మూడేళ్ళే చిన్న…సో వీళ్ళని ఆడించలేదు నేను……నిచ్చి పుట్టినప్పుడయితే నేను కొంచెం పెద్దయ్యా కాబట్టి వాడిని ఎతుకోనిచ్చేవాళ్ళు…చిన్న బొమ్మలా అనిపించేవాడు నాకు…పెద్ద పెద్ద కళ్లు, భలే భలే బుగ్గలు…చాలా ముద్దుగా వుండేవాడు :) తను కొంచెం పెద్దయ్యాక (నాలుగు – ఐదు ఏళ్ళు వచ్చాక) నా స్కర్ట్స్, గౌన్స్ వేసి రెడీ చేసేదాన్ని.. అజుభా (పెద్ది కొడుకు) పుట్టినప్పుడు నాకు పన్నెండేళ్ళు వచ్చేశాయి…వాడితోనూ ఆడుకున్నా కానీ మరీ ఎక్కువ కాదు…ఇప్పుడు నిచ్చి డాక్టర్ అయిపోయాడు…టైం ఎంత ఫాస్ట్ గా అయిపోతుందో కదా అనిపిస్తుంది…నిన్న అత్తమ్మ ఫోన్ చేసి నిచ్చి రిజల్ట్స్ వచ్చాయని చెప్పాక చాలా సంతోషంగా అనిపించింది….పొద్దున్న పాత ఆల్బమ్స్ చూస్తుంటే వీడి ఫోటో కనిపించింది…నెలల బేబీ అప్పుడు…ఇప్పుడు ఆరడుగులు అయిపోయాడు :D

No comments:

Post a Comment